శూర్పకర్ణుడు
సెప్టెంబర్ 06, 2024
శూర్పకర్ణుడు (ṣūrpa-karnudu)
అర్థము
(విశేష్యము) : శూర్ప=చేట, రెండు ముంతల కొలత; కర్ణ=చెవి; చేట చెవులవాడు; వినాయకుడు
Meaning
(noun) : large ear-ed man; Ganesha
వాడుక / Usage
చేట గింజల నుంచుకొని పొట్టును చెరిగి వేసినట్లు, అన్నీ విన్నా చెడుని వదిలి మంచినే ఉంచుకునేవాడు శూర్పకర్ణుడు.
Just as a winnow sifts husk from grain, one who despite hearing everything ignores the bad and retains the good is called Shoorpakarna.
మెదడుకు మేత / Food for thought
నిజానికి అక్షరాలంటే ...నా బతుకు ... నా మెతుకు....
నా మొదలు... నా తుది ..
అవి కలసికట్టుగా మహా కావ్యాలనే విరచించాయి కదా ...
అక్షరాలు ఏకతా సూత్రాన్నే వల్లె వేస్తాయి ...
అవున్నిజం ...
రాజమహేంద్రి గోదారి నీట్లో తలారా స్నానించిన
భారతం మీద -
ఓరుగల్లు వెయ్యి స్తంభాల గుడిలో వళ్ళు విరుచుకున్న
భాగవతం మీద ఆన -
విడిపోయినా కలిసున్నా
ప్రతి తెలుగువాడి గుండెమీద అచ్చుపడ్డ అచ్చులూ .... హల్లులూ
ఎపుడూ కలిసే వుంటాయి
తెలుగు భాష మీద ఒట్టు... !!
-- పి వి డి ఎస్ ప్రకాష్
Comments
Post a Comment