కుఠారము

 

అక్టోబర్ 02, 2024

కుఠారము  (kuṭhāramu)

   అర్థము

   (విశేష్యము) : గొడ్డలి

  Meaning

   (noun) : an axe

   వాడుక / Usage

    భవకాననశాతకుఠారధార, సజ్జనపరిపాలశీల. 
    O protector of the good! you are the axe that cuts the dense forest of Samsara.

   మెదడుకు మేత / Food for thought

    రాజు, కేవలం అసూయా దృష్టితో ధనవంతుల సిరిసంపదలు అపహరించరాదు. పులి తన కూనలను ఆకలితో కబళించినట్లు విత్తాకర్షణకు ఉపక్రమించిన యెడల అంతంతమాత్రమే సొమ్ము లభించగలదు. ఇందువల్ల జలగ నెత్తురు పీల్చినట్లు ఏలిక వేదన కలిగించని సుఖోపాయాలతో ప్రజలనుండి పన్నుల రూపంలో విత్తం స్వీకరించవలెను. అదీ కేవలం ప్రజాపరిపాలన కోసమే.

-- భీష్ముడు ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి