లవలేశము
అక్టోబర్ 03, 2024
లవలేశము (lava-lēṣamu)
అర్థము
(విశేష్యము) : చాలా తక్కువ; అత్యంత అల్పము
Meaning
(noun) : very little
వాడుక / Usage
ఎవరి శ్రమ భారమైనా ఉచితంగా లవలేశమైనా తీసుకోకూడదు.
Don't use anyone's effort, even if very little, for free.
మెదడుకు మేత / Food for thought
మిక్కుటమైన భోగలోభం విపరీత మోహావేశం కలిగిస్తుంది. దానివల్ల మనస్సు ఆవసమైన యెడల దైనందిన ధర్మ విఘాతం సంఘటిల్లుతున్నది. పాపాలు ఆచరించవలెనన్న సంకల్పం ఉద్భవిస్తున్నది. అవి పరిశీలించి, నిగ్రహించి సజ్జన సాంగత్యంతో కాలం వెళ్లబుచ్చిన యెడల విషయాసక్తి సడలగలదు, ధార్మికబుద్ధి పుడుతుంది. ఆ ధర్మాచరణతో సంతృప్తి చెందక ద్వంద్వాతీతుడైన మానవునికి అపాయ విరహితమైన ఉపాయం గోచరిస్తుంది. దానివల్ల అనతికాలంలో మోక్షం కరతలామలకం కాగలదు.-- భీష్ముడు ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం
Comments
Post a Comment