ప్రాశనము
అక్టోబర్ 11, 2024
ప్రాశనము (prāṣanamu)
అర్థము
(విశేష్యము/క్రియ) : భోజనము; తినిపించుట
Meaning
(noun/verb) : food; feed; tasting; eating
వాడుక / Usage
కర్నూలులో 15 ఏళ్ల బాలుడికి అన్న ప్రాశన.. ఆసక్తికర కారణం.
Fifteen year old from Kurnool tastes solid food for the first time.
మెదడుకు మేత / Food for thought
”మీరేమో పరమ శుచిమంతులు, మంచి ఇంట్లో వాసం చేయక శ్మశానం లో ఉన్నారేమి స్వామీ?””భయంకరమైన భూతాలు, ప్రజలను చంపుతూ బాధలు పెట్టేవి. అప్పుడు బ్రహ్మగారు నా దగ్గరకొచ్చి ’శివా! జీవులను కాపాడే మార్గం చూడవయ్యా’ అని అడిగితే భూతాల నివాసమైన శ్మశానం లో నివాసం ఏర్పాటు చేసుకున్నా, అవి నా కనుసన్నలలో ఉండటంతో లోకాలు రక్షింపబడ్డాయి. మోక్షపరులు ఇది శుచిస్థానం అంటారు, జనం తిరగరు, అందుకు ఇక్కడనుంచి లోకాలను రక్షించాలనుకున్నా”.
”ఈ బూడిద రాసుకోడం, పాములు ధరించడం, శూలం,పరశువులు ఆయుధాలు, భీకరమైన రూపం ఏమి స్వామీ?.”
”లోక స్వరూపం రెండు రకాలు. ఒకటి శీతం, రెండవది ఉష్ణం. ప్రపంచం ఈ రెంటితోనే ఉంది. సౌమ్యం విష్ణువు, ఆగ్నేయం నేను, విశ్వాన్ని భరిస్తాను, అందుచేత వేడి, భయంకరమైన రూపం ధరిస్తాను”
-- "శివుడు శ్మశానంలో ఎందుకుంటాడు?" (https://kastephale.wordpress.com)
Comments
Post a Comment