అభ్యంగనము

 

అక్టోబర్ 22, 2024

అభ్యంగనము (abhyanganamu)

   అర్థము

   (విశేష్యము) : వంటికి నూనె రాసుకొనుట; తలంటు

  Meaning

   (noun) : rubbing the body with oil; head bath

   వాడుక / Usage

    పిచ్చి పీక్స్.. బీరుతో అభ్యంగన స్నానాలు.. ఈ సమస్యలొస్తాయ్.
    Heights of madness..beer baths..causes these problems.

   మెదడుకు మేత / Food for thought

    నాడి చూస్తాడు. నాన్న పోయారని చెపుతాడు. అందరూ ఏడవటం ప్రారంభిస్తారు. ఒక ప్రాణి ఈ లోకం నుంచి నిష్క్రమించటాన్ని అంత వేదనా భరితం చేయటం ఎందుకనిపించింది. నిశ్శబ్దంగా, నిర్వేదంగా ఒక వేదాంత భావంతో అలా కూర్చుని వున్నాను. ఆయన యెంత కష్టపడి చదివి పైకి వచ్చిందీ, ఎక్కడో కోనసీమలో ఒక బీదకుటుంబంలో పుట్టి మమ్మల్ని ఎలా వృద్ధిలోకి తెచ్చిందీ ఆలోచిస్తూ మధ్య మధ్యలో ఆ పెదవుల మధ్య తులసి తీర్థం పోస్తూ కూర్చునే ఉన్నాను.

    -- అంతర్ముఖం ముందుమాట, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి