అభ్యాసము
అక్టోబర్ 23, 2024
అభ్యాసము (abhyāsamu)
అర్థము
(విశేష్యము) : మరల మరల చేయుట; సాధన; సమీపము
Meaning
(noun) : practice; continued use/repetition; near
వాడుక / Usage
నిరంతర అభ్యాసంతోనే ఉజ్వల భవిత.
Continuous learning and practice enables a bright future.
మెదడుకు మేత / Food for thought
మీరెవరైనా ఎపుడైనా చావుని అనుభవించారా? చచ్చు ప్రశ్న. నిజంగానే చావుకు ముందు నా మతి పోతోంది. లేకపోతే చావుని అనుభవించడమేంటి? అదేమీ నెలకీ, సంవత్సరానికీ ఒకసారి వచ్చే అనుభవం కాదుగదా! నేనీ ప్రశ్న ఎందుకడుగుతున్నానంటే, ఇప్పుడు నేను చావుని అనుభవిస్తున్నాను కాబట్టి. నిజంగా ఇంత దుర్భరమైన స్థితి పగవాడికి కూడా వద్దు.
-- అంతర్ముఖం, యండమూరి వీరేంద్రనాథ్
Comments
Post a Comment