జేగీయమానము
అక్టోబర్ 04, 2024
జేగీయమానము (je-geeya-manamu)
అర్థము
(విశేష్యము) : మిక్కిలి కొనియాడదగినది; జేజేలు పాడ తగినది
Meaning
(noun) : singing praise worthy
వాడుక / Usage
సహస్రాబ్దాల సంస్కృతీ వారస త్వం, మరే భాషకూ లేని తలకట్టు ధీమత్వంతో జేగీయమానమై తరతరాలుగా తెలుగువారి విజ్ఞాన దాహార్తిని తీరుస్తూ వచ్చింది మన మాతృ భాషే.
With millennia of cultural heritage, heady confidence (in lettering) worthy of lofty praise, our mother tongue has been the eternal spring quenching our thirst for knowledge.
మెదడుకు మేత / Food for thought
ఇంద్రియావళి మనస్సులో విలీనం చేసి మనస్సహంకారంలో అణగించి, అహంకారం బుద్ధితో మేళవించి, బుద్ధి ప్రకృతిలో అణగించిన యెడల క్రమక్రమంగా నిర్గుణ ధ్యాన తత్పరత అలవరుపడుతున్నది. అట్టి నిశ్చల ధ్యాన నిష్ఠ వల్ల క్రమశః అజరామరము, నిర్వికల్పము, విమలము అయిన పరబ్రహ్మ సాక్షాకృతి లభిస్తున్నది. అట్టి మహాయోగి నివాత నిశ్చల దీపకళికవలె, నిస్తరంగ సాగరం వలె సుస్థిరుడై లోలోపల భేరీ మృదంగాది ధ్వనులు ఎన్ని చెలరేగినా అచంచలుడై కేవలం తటస్థ దృష్టితోనే తన మనుగడ కొనసాగిస్తాడు.-- భీష్ముడు ధర్మరాజుతో, శాంతి పర్వం - శ్రీ మహాభారతం
Comments
Post a Comment