చీరచిక్కు

 

అక్టోబర్ 07, 2024

చీరచిక్కు  (cheera-chikku)

   అర్థము

   (క్రియ) : చీర చాలకపోవడం; గర్భవతి అవ్వడం

  Meaning

   (verb) : becoming pregnant

   వాడుక / Usage

    కొద్ది కాలానికి వారి ప్రార్థనలు సాకారముకాగా ఆమె చీరచిక్కెను.
    In due course their prayers were answered and she became pregnant.

   మెదడుకు మేత / Food for thought

    గోదారమ్మంటే మాకు ప్రాణం. అమ్మకి చెరొకపక్కా ఉంటాం కనక మమ్మల్ని తూ.గో.జి, ప.గో.జి అంటారు తప్పించి మేంమంతా ఒకటే. కోస్తాలో ఉత్తర దక్షణాలను కలుపుతూ అమ్మ మీద ఒక వంతెన నిర్మించాడో తెల్లవాడు, వాడిపేరు హేవ్ లక్, ఆ పేరే పెట్టేరు వంతెనకి కూడా. తెల్లవాడు వాడి తాతముల్లె తెచ్చి కట్టించలేదు, మన సొమ్ముతోనే కట్టించేడు, గట్టిగానే కట్టించేడు, నాటి రోజులకి నలభై వేలకి,మూడేళ్ళలోపు, వందేళ్ళు మన్నింది. వంతెనకి రంగెయ్యడానికయిన ఖర్చు ఆరు రూపాయలు అక్షరాలా,ఆ రోజులలో. వంతెనకంత చరిత్ర వుంది.

-- "గోదావరి వంతెన– తెలుగువారి గుండె చప్పుడు, ఆయ్!." (https://kastephale.wordpress.com/page/35/)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి