పువ్వుముడుపు
అక్టోబర్ 08, 2024
పువ్వుముడుపు (puvvu-muḍupu)
అర్థము
(విశేష్యము) : గర్భిణీ స్త్రీకి సీమంత సమయములో కొప్పులో పూలు ముడుచుట; సీమంతము
Meaning
(noun) : placing flowers in the hair, a ceremony for pregnant woman
వాడుక / Usage
ఆమె పువ్వుముడుపు సంబరం రంగరంగ వైభవంగా జరిగింది.
Her baby shower was celebrated with pomp and gaiety.
మెదడుకు మేత / Food for thought
పెళ్ళికి తాళి కట్టేటపుడు రెండు గట్టిముడులు ఒక జారు ముడీ వేయాలంటారు. ఇలా రెండు మంగళ సూత్రాలూ రెండు సార్లు కట్టిస్తారు.పెళ్ళి తరవాత బ్రహ్మగారు ఇద్దరి చెంగులూ కలిపి ముడేస్తారు దీనిని ‘బ్రహ్మ ముడి’ అంటారు. అది మళ్ళీ ఆయనే విప్పాలి, మనం విప్పుకోకూడదు.మన మనసులు ముడేసుకోవాలి, ఆ ముడి రోజురోజుకీ బిగవాలి. పై బ్రహ్మగారు ఎవరితో ముడేస్తే వారితో జీవితాంతం గడపాలి, తనువులెలాగా ముడిపడతాయి, మనసులు ముడిపడటమే ముఖ్యం.. పితృ కార్యాలలో దర్భతో ‘పవిత్ర’మని ఒక ముడి వేసి ఉంగరం వేలుకి పెడతారు, ఆ కార్యక్రమం పూర్తి అయేదాకా. ఆచారవంతులు ఆ ముడిని బంగారపు ఉంగరంగా కూడా చేయించుకుని ధరిస్తారు. ముడెయ్యడం చేతకాకపోతే ఎలా అంటే, నేటి విద్యార్ధులకు ఇటువంటి చిన్న పనులు చేసుకోడం కూడా చేత కావటం లేదు మరి.-- "ముడి" (https://kastephale.wordpress.com)
Comments
Post a Comment