బాలెంత
అక్టోబర్ 10, 2024
బాలెంత (bālinta)
అర్థము
(విశేష్యము) : క్రొత్తగా ప్రసవించిన స్త్రీ; ప్రసూత
Meaning
(noun) : a woman who has given birth
వాడుక / Usage
బాలింతలు త్వరగా కోలుకోవాలా? ఈ పోషకాలు ఉండే ఆహారం తప్పనిసరి.
Want to quickly regain postpartum health? This nutritious diet is a must.
మెదడుకు మేత / Food for thought
గోజిలలో ఆవకాయ పెట్టడంలో వైవిధ్యం ఎక్కువ. చెప్పుకోవాలంటే పులిహోర ఆవకాయ,పెసరావకాయ,శనగల ఆవకాయ, నూపిండి ఆవకాయ ఇలా ఎన్నో, ఎన్నో రకాలు. ఈ రకాల ఆవకాయలకి అన్నిటికి ఒక ప్రత్యేకత, ముక్కలు చిన్న చిన్నవిగా ఉండాలి. డొక్క ఉంటే సరి,లేకున్నా ఫరవాలేదు.. ఎంత చిన్నవైతే ముక్కలు, అంత మంచిది. ఈ ఆవకాయలు నిలవ ఉండేది తక్కువ. ఊరగాయల కాలంకి మూడు నాలుగు నెలల్లో అవకొట్టేయాలి, లేకపోతే బూజెక్కిపోతాయి. పులిహోర ఆవకాయకి ముక్కలు చిన్నవిగా ఉంటాయి,మెంతి,కారం,ఉప్పు పోస్తారు, నూనెతో గుచ్చెత్తుతారు. ఆపై ఎండు మిర్చి ముక్కలు చేసుకుని, శనగపప్పు, మినపపప్పు, ఆవాలు, మెంతులు తో పోపు పెడతారు. కొందరైతే ఇంగువ కూడా వేస్తారు.ఇవన్నీ నూనెలో పుల్లటి ఊటలో నాని తింటుంతే ఆదో రుచి.-- "పులిహోర ఆవకాయ" (https://kastephale.wordpress.com)
Comments
Post a Comment