బారసాల
అక్టోబర్ 09, 2024
బారసాల (bārasāla)
అర్థము
(విశేష్యము) : శిశువు పుట్టిన పదకొండవ రోజు చేసే సంస్కారం; బాలసారె; నామకరణం; తొట్టెల
Meaning
(noun) : a ceremony, typically on 11th day after birth, to name the child
వాడుక / Usage
బాలశౌరి కృష్ణుడికి, బాలసారె కావాలెనా! గర్గి మహర్షి కృష్ణుడు అని పిలవమన్నాడు.
Krishna the brave boy, does he need a naming ceremony! Sage Gargi called him Krishna.
మెదడుకు మేత / Food for thought
సముద్రంలో భూమి ఉందా,భూమి మీద సముద్రం ఉందా? వికట ప్రశ్న. పంచభూతాల సృష్టి క్రమం చూస్తే ముందు పుట్టినది, ఆకాశం, దానినుంచి పుట్టినది వాయువు, వాయువునుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది,నీటి నుంచి భూమి పుట్టింది. ఇప్పుడు చెప్పండి నీటిలో భూమి ఉందా? భూమి మీద నీరు ఉందా? అదే సముద్రే వసనే దేవీ, పర్వతే స్తన మండలే, భూమిపైనున్న పర్వతాలని స్తనాలతో పోల్చారు. ఎందుకు? బిడ్డ పుట్టినప్పటినుంచి తల్లి ఆహారం పాల ద్వారా స్తనాలనుంచే ఇస్తుంది. అలాగే భూమి పైనున్న పర్వతాలు స్తనాలలా నీటిని నదులద్వారా ప్రజలకందజేసి, ఆకలి తీరుస్తూ ఉంది.విష్ణుపత్ని, విశ్వం విష్ణు సహస్రనామాలలో మొదటి రెండు నామాలు. సృష్టి సమస్తం విష్ణుమయం, “సర్వం విష్ణుమయం జగత్”, విష్ణువు శక్తి స్వరూపమే సృష్టి. మనకు కావలసిన ఆహారం నుంచి సర్వమూ భూమి నుంచి వచ్చేవే. భూమినుంచి పుట్టి భూమిలో కలసిపోతాం. అటువంటి భూమికి కృతజ్ఞతతో కూడిన నమస్కారం.-- "ఉదయ ప్రార్ధన శ్లోకాలు-అర్ధాలు/పరమార్ధాలు" (https://kastephale.wordpress.com)
Comments
Post a Comment