జిలిబిలి

 

నవంబర్ 20, 2024

జిలిబిలి (jili-bili)

   అర్థము

   (విశేషణము) : శృంగారమైనది; జడకొప్పులో పెట్టుకునేది; ఇంపైనది; మనోహరమైనది; అల్పమైనది

  Meaning

   (adj) : pleasing; fine; charming; delicate; petty

   వాడుక / Usage

    మేని మలుపుల చెలువపు గమనము వీణ పలికిన జిలిబిలి గమకము.
    Beautiful gait of the curvaceous body, charming melody plucks the Veena.

   మెదడుకు మేత / Food for thought

    కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు లనేకుల్ సూచుచుండన్ మదో 
    ద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన ఖలున్ దుశ్శాసనున్ లోకభీ 
    కరలీలన్ వధియించి తద్విపుల వక్షశ్శైలరక్తౌఘనిర్ఝర 
    ముర్వీపతి సూచుచుండ నని నాస్వాదింతు నుగ్రాకృతిన్

(వృద్ధులైన కురువంశీయులు, ద్రోణాచార్యాది గురువులు, పెద్దలనేకులు చూస్తుండగా మదముచే నిరంకుశుడై ద్రౌపది నీ విధంగా చేసిన క్రూరదుశ్శాసనుని లోకమునకు భయం కల్గించే విధంగా యుద్ధమున చంపి రాజైన దుర్యోధనుడు చూస్తుండగా వాని వెడల్పైన రొమ్మనెడి పర్వతం నుంచి సెలయేరు వలె ప్రవహించు రక్తాన్ని భయంకరాకారంతో రుచి చూస్తాను)

    -- మహాభారతం, ఆది కవి నన్నయ్య (~ పదకొండవ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి