అధరము

 

నవంబర్ 28, 2024

అధరము (adharamu)

   అర్థము

   (విశేష్యము/విశేషణము) : (క్రింద) పెదవి; క్రిందది; తక్కువైనది

  Meaning

   (noun/adj) : (lower) lip; lowest; inferior

   వాడుక / Usage

    అరుణారుణమీ అధరము తరుణ మందార పల్లవము.
    Redder than red are your lips; they are the tender bud of a Mandara flower.

   మెదడుకు మేత / Food for thought

    మొదటి దెబ్బ పడుతూనే
    రాయి నుంచి ఆర్తనాదం వినపడింది ...ఆ అని

    అప్పుడు తెలిసింది రాళ్ళల్లో కూడా
    ఉంటుంది ప్రాణం అని

    ఆ ప్రాణం ఎక్కడ దాగుందో
    తెలుసుకోడానికి

    పోట్లు పొడుస్తూనే ఉన్నాడు
    చురుకైన చేతులతో ఆ మూర్తికారుడు

    పరిపూర్ణమైన శిల్పాన్ని ఒకే రాయి నుంచి
    చెక్కి బయటకి వెలికితీసాడు

    అప్పుడు తెలిసింది రాతి గుండె
    గాయం మానని చోటే ఉందని

    ఆ శిల్పి చూస్తూ ఉండిపోయాడు
    రక్తసిక్తమైన తన హస్తాలని...
    
    -- పత్తర్ కే ప్రాణ్, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి