జటాధర

 

డిసెంబర్ 02, 2024

జటాధర (jataadhara)

   అర్థము

   (విశేష్యము) : జట (జడ) లను ధరించువాడు; సన్యాసి; శివుడు

  Meaning

   (noun) : one who wears matted locks; monk; Shiva

   వాడుక / Usage

    కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ.
    One with radiant splendour as camphor and sporting matted locks; salutations to Shiva, who incinerates the sorrow caused by lack of Gnyana.

   మెదడుకు మేత / Food for thought

    ఛలోక్తులు విసరడంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు సిద్ధహస్తులు. ప్రసిద్ద మైన ఆయన ఛలోక్తులలో ఇదిగో ఇది ఒకటి: ఆయన బందరు నోబుల్‌ కాలేజీలో కొంతకాలం లెక్చరర్‌గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన హైస్కూలు పాఠాలు కూడా చెప్పేవారు. ఒకరోజు ఆయన కాంపో జిషన్‌ పుస్తకాలు (40) పట్టుకొని ఇంటికి బయల్టేరారు. ఎదురుగా ఓ విద్యార్థి వచ్చాడు, గురువుగారిని చూసి నవ్వుకొని. “అయ్యో! మాస్టారుగారు గాడిద బరువు మోస్తున్నారు” అన్నాడు. దానికి నాయుడుగారు నవ్వుతూ- “అబ్బే. ఒక్క గాడిద బరువు కాదురా, నలభై గాడిదల బరువు” అన్నారు.

-- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, డా. సి. మృణాళిని

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి