వేగు
నవంబర్ 25, 2024
వేగు (vegu)
అర్థము
(క్రియ/విశేష్యము) : తపించు; దుఃఖపడు; క్షీణించు; ఉదయమగు; చారుడు; రాజ్య సమాచారం
Meaning
(verb/noun) : to be fried; to grieve; sorrow; to dawn; spy; espionage
వాడుక / Usage
ఇన్ని నాళ్ళు నేనెటుల వేచితినొ, ఇన్ని రేలు ఎంతెంత వేగితినొ.
Alas! days forever how did I bide? nights long and lonely how much I pined!
మెదడుకు మేత / Food for thought
నేను ఇప్పటికి కూడా ఇంకా
ఆ లోతులలోనే నుంచున్నానా
ఆ ఎత్తుల ఏలిక కట్టడి చేస్తున్న ఈ చోటున?
ఈ మెట్లు నన్ను తీసుకెళ్లేనా
అన్నింటికీ శిఖరాగ్రమైన మహోన్నత ఆ జగానకి
ఎక్కడైతే ఆకాశాన్నంటే స్తంభాలు సమసిపోతాయో
పునీతమైన మస్తిష్కానికి బావుటా ఎగరేసే ఆ చోటుకి
-- కుతుబ్ మినార్, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)
Comments
Post a Comment