రవళి

 

నవంబర్ 12, 2024

రవళి (ravali)

   అర్థము

   (విశేష్యము) : ధ్వని

  Meaning

   (noun) : sound; noise

   వాడుక / Usage

    పాడుతున్నది ఎదమురళి, రాగఝరి తరగల మృదురవళి.
    The heart beats to the song, waves of cascading notes making a tender music.

   మెదడుకు మేత / Food for thought

    ఏ కన్ను చూడదనా
   నీ విచ్చలవిడి మిడిసిపాటు
   ఏ చెయ్యి ఆపదనా
   తప్పటడుగే నీ అలవాటు
   అదృశ్య దృష్టిగా సకల సృష్టి
   నిన్ను గమనిస్తున్నది లెక్క గట్టి

   ఎంత బ్రతుకు నీదెంత బ్రతుకు
   ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు
   ఇన్నాటలు వేటలు అవసరమా
   మనుజా.... మనుజా.....
   ఏమారితే నిన్ను కబళిస్తుందిరా
   మాయదారి పంజా.....

   కోరి కొని తెచ్చుకోమాకు కర్మ
   దాన్ని విడిపించుకోలేదు జన్మ.....

   సత్కర్మ భిశ్చ సత్ఫలితం
   దుష్కర్మ ఏవ దుష్ఫలం!
   అచ్యుత్కట పుణ్య పాపానం
   సత్యం ఫలాను భవమిహం!!

    -- రామజోగయ్య శాస్త్రి, బ్లఫ్ మాస్టర్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి