కులుకు
నవంబర్ 13, 2024
కులుకు (kuluku)
అర్థము
(క్రియ) : శృంగారంగా కదులు; సొగసుగా
Meaning
(verb) : to move gracefully; to be melodious
వాడుక / Usage
తూగుతున్నది మధుర వని లేత విరి కులుకుల నటన గని.
Flowers intoxicated sway; seeing of yours the charming sashay.
మెదడుకు మేత / Food for thought
తెలుసు ఇది నీటి మూటని ...
తెలుసులే ఇది గాలి మేడని ...తెలుసు ఈ బుడగ టప్పని పగిలిపోతదని ....
తెలుసు ఉట్టి పై ఉన్నదంతా ఉష్కాకాకియనీ ...
అన్నీ తెలిసి అడుసులొ పడి దొర్లుతుంటాము దేనికని
మాయ ... మాయా... మాయా
తేలిపోయింది ... తెలిసిపోయింది ...
తెలియనిదేదో ఉందని మనసా ...
తెలుసని ఎందరు చెబుతున్నా అది ... ఉందో లేదో తేలని హంసా ....
కళ్ళు రెండూ మూసెయ్యలంటా .... మూడో కంటిని తెరవాలంటా ...
మిన్ను మన్నూ మిట్టా పల్లం ఒక్కటిగా కనిపించాలంటా ...
ఆడే వాడు ఆడించే వాడు ఏకపాత్రలని ఎరగాలంటా ...
ఆ ఎరుక వచ్చి రాగానే
మాయం అయిపొతుందట మాయ
-- జె. కె. భారవి, జగద్గురు ఆది శంకర
Comments
Post a Comment