భుజగము

 

డిసెంబర్ 03, 2024

భుజగము (bhujagamu)

   అర్థము

   (విశేష్యము) : వంకర టింకరగా పోవునది; పాము

  Meaning

   (noun) : that which moves in curves; snake

   వాడుక / Usage

    గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ.
    One who is dear to Gowri; and adorned by a phase of the lord of the night (moon); who ends time (by granting Moksha); and wears the Lord of snakes as an arm band.

   మెదడుకు మేత / Food for thought

నటనకు కొత్త అర్థాన్ని చెప్పిన అసమాన నటుడు బళ్ళారి, రాఘవ. “మా బెంగాలీ నటులు బెంగాల్‌కు మాత్రమే గొప్ప నటులుగానీ, యావద్భారత దేశంలోనూ అతి గొప్ప నటుడు ఆంధ్రదేశానికి చెందిన బళ్ళారి రాఘవే”నని విశ్వకవి రవీంద్రనాథ టాగోర్‌ చేత కీర్తింపబడిన నటుడు బళ్ళారి రాఘవ, తెలుగు రంగస్థల నటనలో సుదీర్భ మైన రాగాలాపనకూ ఆతి నాటకీయతకూ స్వస్తి చెప్పి, చక్కని హావభావ ప్రకటనకు పట్టంగట్టిన బళ్ళారి రాఘవ  నాటకరంగాన్నే ఒక్క ఊపు ఊపారనడం అతిశయక్తి కాజాలదు. “రామరాజ చరితములో పఠాన్‌ రుస్తుంగా; “పాదుకా పట్టాభిషేకము'లో దశరథుడిగా, ఒథెల్లోగా, కింగ్‌ లియర్‌గా రాఘవ 'నటనను చూసినవారు తమ జన్మ ధన్యమైనట్టు భావించేవారు. అనంతపురం జిల్లాలో 1880 ఆగస్టున జన్మించిన రాఘవ 1946 ఏపిల్‌ 16న మరణించారు.

-- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, డా. సి. మృణాళిని

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి