కుసుమము

 

నవంబర్ 19, 2024

కుసుమము (kusumamu)

   అర్థము

   (విశేష్యము) : పువ్వు; ఒక కంటి జబ్బు; ఎర్ర రంగు

  Meaning

   (noun) : flower; safflower; rose colour

   వాడుక / Usage

    కాదా మమకారం నీ పూజా కుసుమం.
    Isn't my affection, a flower of devotion to you?!

  మెదడుకు మేత / Food for thought

    ధారుణి  రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణజూచి, రం
    భోరు నిజోరుదేశమున నుండగ బిల్చిన యిద్దురాత్ముదు
    ర్వార మదీయబాహుపరివర్తిత చండ గదాభిఘాత భ
    గ్నోరుతరోరు జేయుదు సుయోధను నుగ్రరణాంతరంబునన్

    (భూమి మీద తన రాచరికం చెల్లుతున్నదనే గర్వంతో దుర్యోధనుడు ద్రౌపదిని చూచి తన తొడల మీద కూర్చొన రమ్మని పిల్చినాడు. ఆ దుర్మార్గున్ని యుద్ధంలో నా చేతులతో గదను తిప్పుతూ దాంతో వాడి తొడలు నుగ్గు చేస్తాను)

    -- మహాభారతం, ఆది కవి నన్నయ్య (~ పదకొండవ శతాబ్దము)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి