ముంగురులు
నవంబర్ 27, 2024
ముంగురులు (mun-gurulu)
అర్థము
(విశేష్యము) : ముందు కురులు; నొసటిపై పడే ఉంగరపు వెంట్రుకలు
Meaning
(noun) : curls on forehead; front locks
వాడుక / Usage
ఈ నీలి నీలి ముంగురులు ఇంద్ర నీలాల మంజరులు.
These black curls on your forehead are the emeralds adorning you.
మెదడుకు మేత / Food for thought
పుట్టుకతోనే ఈశ్వర సాక్షిగా ప్రతిజ్ఞ చేసాను
రణం తలపెట్టనని, ఎందుకంటే
తండ్రీ - కొడుకులం గాబట్టి
అన్నా - తమ్ములం గాబట్టి
బంధువులు - చుట్టాలు గాబట్టి
స్నేహితులు - ప్రియ సఖులు గాబట్టి
తిరిగి ప్రతిజ్ఞ పట్టాను
రణాల యుద్ధ భూమిలో ఈశ్వర సాక్షిగా
మనలో ఎవ్వరూ వెనుకంజ వెయ్యరని
ఎందుకంటే ఇక్కడ ఎవ్వరికీ ఎవ్వరూ ఏమీ కాదు
అందరూ అందరికీ శత్రువులే
ప్రతీ మనిషికి తన యుద్ధం వేరే
రణం ఈనాటికీ సాగుతోంది
మనుషులు నేటికీ రణించి మరణిస్తూనే ఉన్నారు
ఈశ్వరుడే సాక్షి
-- ఈశ్వరుడే సాక్షి, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)
Comments
Post a Comment