జఘనము

 

నవంబర్ 29, 2024

జఘనము (jaghanamu)

   అర్థము

   (విశేష్యము) : మొల; కటి స్థలము; పిరుదులు

  Meaning

   (noun) : haunches; hips; loin

   వాడుక / Usage

    ఎంత సుందరము శిల్ప బంధురము ఈ జఘన మండలము సృష్టి నంతటిని దాచుకున్న పృథివీ మండలము.
    How beautiful are the fulsome hips that behold the whole creation fecund like earth.

   మెదడుకు మేత / Food for thought

    భుజాలపై ఎండ యొక్క పసుపుపచ్చ శాలువా కప్పుకుని
    రహదారి పక్కనే చడీ చప్పుడు లేకుండా నుంచున్న
    మనిషిలా ఆనుతున్న ఒక చెట్టుని నేను అడిగాను
    సత్రానికి దారి ఏదని..

    అది బదులు ఇవ్వలేదు,
    మళ్ళీ అడిగాను అయినా మాటలాడలేదు

    ముందుకు సాగడానికి సిద్ధమవుతుంటే
    ఎదో అన్నది కదా అనిపించింది...

    నేనే కాబోలు దాని భాషని
    అర్థం చేసుకోలేదు, ఆ భాష
    ఓ నీడ లాగా వినమ్రంగా
    ఒక రెపరెప లాగా సహృదయంగా పిలిచింది
     
    -- ఆతిథ్యము, కువర్ నారాయణ్ (సెప్టెంబర్ 19, 1927 - 2017)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి