డిసెంబర్ 04, 2024
ఫాలాక్షము (phālākshamu)
అర్థము
(విశేష్యము) : ఫాలము=నుదురు, అక్షము=కన్ను; నుదురుపైన ఉన్న కన్ను; శివుని మూడవ కన్ను
Meaning
(noun) : eye on the forehead; Shiva's third eye
వాడుక / Usage
చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ.
One who wears tiger skin and is embalmed in ashes; has a third eye and is adorned with a diamond ear ring.
మెదడుకు మేత / Food for thought
త్రిపురనేని రామస్వామిగారిలో తక్కిన గుణాల మాటెలావున్నా, ఆయన నాస్తి కత్వం సమకాలీనులకు కొరుకుడు పడేదికాదు. అలాంటి కవిరాజు ఆర్యసమాజంలో చేరగానే, “అమ్మయ్యా! దొరికింది రామస్వామి పిలక' అనుకున్నారు ప్రత్యర్థులు. ఓ సభలో ఒక ఆస్తికుడు “నాస్తికుడినని చెప్పుకునే మీరు ఆస్తికులైన ఆర్యసమాజంలో ఎలా చేరారు?” అని అడిగారు, దానికి చౌదరిగారి సమాధానం, “ఆయ్యా! తక్కినవాళ్లు ముప్పైమూడు కోట్ట దేవతలున్నారంటున్నారు. ఆర్యసమాజంవారు చక్కగా ఒకే దేవుడున్నాడంటారు. ఆ ముప్పైమూడు కోట్ల దేవతలతో వాళ్ళు కుస్తీపడి ఓడించి, తమ ఒక్క దేవుడిసీ నిలబెట్టగలిగితే, ఆ ఒక్క దేవుడితో కుస్తీపట్టి ఓడించడం నాకు సుళువు కదా! అందుకని ఈ సమా జంలో చేరాను”
-- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, డా. సి. మృణాళిని
Comments
Post a Comment