డిసెంబర్ 16, 2024
సిత (sita)
అర్థము
(విశేష్యము) : చక్కర; తెల్లనిది; ఆకర్షించునది; కట్టబడినది; ముగిసినది
Meaning
(noun) : sugar; something white; attractive; bound; completed
వాడుక / Usage
శరద్కాల చంద్రుడు సిత ప్రకాశుడై ఆకశాన కనువిందు చేసాడు.
The autumn moon graced the sky with white radiance.
మెదడుకు మేత / Food for thought
హిందువులైనను సరే, మహమ్మదీయులైనను సరే, క్రైస్తవులైనను సరే; లోకములో దౌష్ట్య మాచరించుచు, దేవుడు దేవుడని దొంగవేషములు వేయువాని కెప్పుడును ఆత్మచ్యుతి యున్నది. వాని మతము వానికి దుర్వ్యవసాయము లెక్కువ చేయుటకు పనికివచ్చును కాని, వాని యాధ్యాత్మిక ప్రవృత్తిని వృద్ధి నొందించుటకు పనికిరాదు. సద్విషయమని తనకు తెలిసిన దాని నెవడాచరించాడో వాడు పాము వంటివాడు. పామునకు రెండు నాలుకలు, వీనికి రెండు పద్ధతులు. -- వేయి పడగలు, విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబర్ 10, 1895 - 1976)
Comments
Post a Comment