ప్రసూనము
డిసెంబర్ 18, 2024
ప్రసూనము (pra-sūnamu)
అర్థము
(విశేష్యము) : పుట్టినది; పుష్పము; ఫలము; మొగ్గ
Meaning
(noun) : flower blossom; bud; fruit; born
వాడుక / Usage
మల్లెల ప్రసూనాల తల్పంపై సఖుని రాకకై ఆమె విరహవేదనతో ఎదురు చూసింది. She spent many a lonely night, on a bed of flowers, waiting for her love.
మెదడుకు మేత / Food for thought
భగవంతుడు సృష్టించిన పవిత్రమైన పులినోట్లో ఒకసారి కాదు పదిసార్లు తలదూరుస్తానన్నాడు. పది దఫాలు అనవసరం. రోజుకి రెండు మార్లయితే చాలునన్నాడు బఫూన్. ఆ విధంగా మా పెదనాయన చైనాదేశంలో ఫ్రెంచి సర్కస్ లో చేరి పెద్దపులి నోట్లో తలదూర్చడం ప్రారంభించాడు. పెదనాన్నా, పులీ మంచి స్నేహితులుగా ఉంటూ వచ్చారు. కానీ, టెహరాన్ నగరంలో, ఆ ప్రాచీనమైన పాపపుచోట పెద్దపులిలో పెద్దమనిషి తరహా నశించింది. ఆరోజు ఎండ మండిపోతుంది. అందరూ తహతాహలాడుతున్నారు. నగరంలో మా పెదనాయన ఆవులించిన పెద్దపులినోట తలదూర్చాడు. ఇక తల తీద్దామనుకునేసరికి ప్రపంచంలోని అన్యాయాలన్నిటికీ ప్రతినిధి అయిన పెద్దపులి రెండు దవడలూ కటుక్కుమనిపించింది. -- పెద్ద నాన్న సర్కస్ పులి , శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)
Comments
Post a Comment