తర్జని

 

డిసెంబర్ 20, 2024

తర్జని (tarjani)

   అర్థము

  (విశేష్యము) : చూపుడు వేలు

  Meaning

  (noun) : index finger

   వాడుక / Usage

   అతని తర్జని ఒక శాసనం అతని పిడికిలి ఒక ఉద్యమం.
   His index finger is an order, his fist is a movement.

  మెదడుకు మేత / Food for thought

    సమాజం పరిణామం పొందిన తర్వాత కుటుంబాలు ఏర్పడి, ఆస్థి కుటుంబపరమైనప్పుడు సంప్రదాయం తల్లకిందులయింది. కుటుంబాలేర్పడినప్పుడు స్త్రీ ప్రాధాన్యం తగ్గి, పురుష ప్రాధాన్యం పెరిగింది. అప్పుడు ఆస్థి తండ్రి నుండి కొడుక్కు సంక్రమించటం ఆరంభమయింది. దాంతో సంతానానికి తల్లికన్నా తండ్రిని లెక్కపెట్టే సంప్రదాయమొచ్చింది. అంతవరకు శబ్దప్రమాణంగా వున్న పితృత్వానికి ప్రత్యక్ష ప్రమాణ ప్రతిపత్తి కల్పించడానికి మార్గాన్వేషణ ఆరంభమయింది. 

    -- ఇనుప కచ్చడాలు, తాపీ ధర్మారావు (సెప్టెంబర్ 19, 1887 - 1973)  

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి