అంకుశము

 

డిసెంబర్ 05, 2024

అంకుశము (ankuṣamu)

   అర్థము

   (విశేష్యము) : ఏనుగుని నడపటానికి కుంభస్థలంపై పొడిచే ఆయుధం

  Meaning

   (noun) : an elephant goad

   వాడుక / Usage

    పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ.
    One with five faces and adorned by the king of serpents; has a golden trident and embodies the three worlds.

   మెదడుకు మేత / Food for thought

భారతదేశంలో ఎంత కవి సామ్రాట్టయినా, బ్యూరోక్రసీ ముందు తలదించుకోవలసిందే. విశ్వనాథ వారు ఒక వని కోసం సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పనికాలేదు. ఇలా లాభం లేదని, టంగుటూరి ప్రకాశం పంతులు గారి వద్దకు వచ్చి, తన పని ఎంతవరకు వచ్చిందో కనుక్కోమని అడిగారు. ప్రకాశంగారు కొంత అయిష్టంగా, “ఆ సచివాలయం పెద్ద ఆడివి, దానిలో పనులు అలాగే ఉంటాయి” ఆని తప్పించుకోజూశారు, విశ్వనాథా వదిలి పెళ్ళేది? వెంటనే, “అందుకే కదండీ మీకు మనవి చేసుకున్నది. మీరు ఆంధ్ర కేసరి కదా! ఆ అడవి మీకో లెక్కా?” అన్నారు. ఇహ ఆ పని నెత్తిన వేసుకోక తప్పలేదు.

-- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, డా. సి. మృణాళిని

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి