అయిపు

 

డిసెంబర్ 24, 2024

అయిపు (ayipu)

   అర్థము

  (విశేష్యము) : జాడ; సూచన; చిరునామ; తప్పు; దోషం

  Meaning

  (noun) : sign; address; indication; defect; mistake

   వాడుక / Usage

   సామాన్యుల విషయంలో అయిపు లేని న్యాయవ్యవస్థ సెలెబ్రిటీల విషయంలో త్వరగా పనిచేస్తుంది.
   Justice system which is nowhere to be seen for commoners works overtime for celebrities.

  మెదడుకు మేత / Food for thought

    ..కూడదీసుకో దేహచలనమా,

    కూడదీసుకో నీ సమస్త ప్రాణకణాల సంస్పందనలను!
    వ్యక్తావ్యక్త పదపరిభ్రమణాల్లోంచే
    కొనవూపిరి జీవితపు కొట్టుకులాటలోంచే
    రాలిపడిన బతుకు పూరెక్కల కుప్పలోంచే
    కూడదీసుకో నీ సమస్త నాడీగత పురాశ్వాసనలను

    గబ్బిలాలు ముసిరిన వైరాగ్యపు భీతిలోంచే
    విచ్చిపోయే కలల కుండల చప్పుడులోంచే

    నీ వంతుకు నీవే
    నీ వంతకు నీవే

    అల్లెతాడుకు విల్లు కర్రకూ మధ్య
    బిర్రబిగిసిన బాణపు ప్రతిచర్యలా
    కూడదీసుకో దేహచలనమా
    కూడదీసుకో…

    -- కిటికీ పిట్ట, పి మోహన్ (2008 ఇస్మాయిల్ అవార్డు గ్రహీత) 

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి