ఆబ
డిసెంబర్ 26, 2024
ఆబ (aaba)
అర్థము
(విశేష్యము) : కంటి పాప (నల్ల గ్రుడ్డు); అత్యాశ; ఆత్రము (తిండి పై)
Meaning
(noun) : pupil of the eye; greediness (esp with food)
వాడుక / Usage
పైసలమీద ఆబని తెలుగు గౌరవానికి కోసమే అని రంగు పూయడం హాస్యాస్పదం. Giving a colour of Telugu pride to one's greediness for money is laughable.
మెదడుకు మేత / Food for thought
నగరం జడలో దీపాల మాలల్ని అలంకరించుకుంది…ఏ హరిణనయన చేతి అమృతభాండం నుండి తొణికిన వెన్నెలో
సముద్రం మీద చెల్లాచెదురైన ముత్యాలసరంలా పరచుకుంది
అలిసిన కన్నుల్లో స్వాప్నిక చంద్రికలని నింపుకుని..
నిద్రని మేలి ముసుగులా తన ముఖం మీదికి కప్పుకుంది
రాత్రి వానలో రాలిన స్వప్నాలను నెమరువేస్తూ
ధ్యానముద్రలో మునిగిన యోగుల్లాపూర్తిగా తడి ఆరని జటాజూటాలతో
చెట్లు ఒంటికాలిపై నిశ్చలంగా నిలబడతాయి
-- నిద్రిత నగరం, డా. వైదేహి శశిధర్, 2009 ఇస్మాయిల్ అవార్డు గ్రహీత
Comments
Post a Comment