వ్యవధి
డిసెంబర్ 30, 2024
వ్యవధి (vyavadhi)
అర్థము
(విశేష్యము) : మేర; అవకాశం; గడువు; సమయం
Meaning
(noun) : limit; boundary; (available) time; duration
వాడుక / Usage
ప్రకాశం జిల్లాలో మరోసారి భూకంపం - అయిదు నిమిషాల వ్యవధిలో మూడు సార్లు. Earthquake rocks Prakasam district again - three times in a duration of 5 minutes.
మెదడుకు మేత / Food for thought
యేయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్తీత్యేకే నాయమస్తీతి చైకే ।ఎతద్విద్యామనుశిష్టస్త్వయాహం వరాణామేష వరస్తృతీయః ॥
(మనుష్యుని మరణానంతరము కొందరు ఉన్నాడు అని కొందరు లేడు అని అంటారు. ఇది సందేహము. దీనిని నీనుంచి తెలుసుకుంటాను అదే నామూడవ వరము అన్నాడు నచికేతుడు యమధర్మ రాజుతో)
-- కఠోపనిషత్, ప్రథమా వల్లి, 20వ మంత్రం
Comments
Post a Comment