అర్ణవము

 

డిసెంబర్ 06, 2024

అర్ణవము (arṇavamu)

   అర్థము

   (విశేష్యము) : సముద్రము; కడలి; అల

  Meaning

   (noun) : sea; ocean; wave

   వాడుక / Usage

    విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ.
     Lord of the Universe who helps one cross the ocean of hell; whose name is nectar to ears and who is adorned on the head by moon.

   మెదడుకు మేత / Food for thought

విశ్వనాథ, శ్రీశ్రీ వంటి మహాకవులు సైతం అబ్బూరిబారిన పడ్డవారే. ఒకసారి హైదరాబాద్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో సభ జరుగు తోంది. విశ్వనాథ సత్యనారాయణ, అబ్బూరి సభలో పాల్గొన్నారు. విశ్వనాథ మొదట 
ప్రసంగిస్తూ, తెలుగు భాషను వేనోళ్ళ కొనియాడారు. అందులో భాగంగా తన పద్యం ఒకటి పాడి వినిపించి, పద్యంలోని కొన్ని అక్షరాలకు వున్న గొప్ప శక్తిని ఊద్గాటించారు. తర్వాత అబ్బూరి వారు ప్రసంగించడానికి లేచారు ఆయన ఒక వారా పత్రికను తీసుకొని, అందులో సంపాదకీయాన్ని రాగయుక్తంగా చదివి, “నన్నయ, విశ్వనాథవారే కాకుండా ఎవరైనా ఇలా రాయగలరు” అన్నారు. ఈ మాటన్నది మరొకరైతే తెలీదు కొని, అబ్బూరివారి సాయే వేరు. వేదికపై  ఏమనుకున్నా, దిగగానే ఇద్దరూ ఒకే రిక్షాలో వెళ్ళారట!

-- తెలుగు ప్రముఖుల చమత్కార భాషణలు, డా. సి. మృణాళిని

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి