బేల
డిసెంబర్ 19, 2024
బేల (bēla)
అర్థము
(విశేషణము) : మూఢుడు/మూఢురాలు; అమాయకుడు/అమాయకురాలు; పిరికి
Meaning
(noun/adj) : simpleton; naivety
వాడుక / Usage
హృదయమా ఓ బేల హృదయమా ఒకేసారిగ నీకింత సంతోషమా. O dear heart, naive heart; why this sudden happiness!
మెదడుకు మేత / Food for thought
వెనుక కాలంలో ఆడవారిలో స్నేహితులు అంత సన్నిహితంగా ఉండేవారు కాదట. స్త్రీ తన రహస్యాలన్నీ ఎవరితోనూ చెప్పదనే అంటారు.అందులో నిజం లేకపోలేదు. మా హృదయాంతరాలలో ఉన్న రహస్యాలు సర్వాంతర్యామియైన భగవంతునికే తెలియనియ్యము. కాని చిన్నతనంలో విద్యాదినాల్లో నెచ్చెలులకు కాస్త మా రహస్యాలు చెప్పుకుంటున్నాము. పురుషులు రహస్యాలు దాచుకోలేరు. ఏ స్నేహితురానితోనో ఎంత నిగూఢ రహస్యాన్నైనా చెప్పేస్తారు. స్త్రీ పురుష సంబంధాలైన రహస్యాలేవన్నా బయటపడ్డాయంటే పురుషుని వల్లనే. ఇంతకూ నాకు ఉండే రహస్యాలేమిటి? -- తుపాన్, అడవి బాపి రాజు (అక్టోబర్ 08, 1895 - 1952)
Comments
Post a Comment