ఆద
డిసెంబర్ 23, 2024
ఆద (āda)
అర్థము
(విశేష్యము) : విచారము; దుఃఖము; మనస్సు; ఆరాటం
Meaning
(noun) : sorrow; grief; anxiety
వాడుక / Usage
పాదం విడిచి ఎటు పోయెను భువనం ఆద మరిచి ఎటు వెళ్ళెను గగనం. Leaving feet behind, where has the world gone? Bereft of anxiety, where did the sky go?
మెదడుకు మేత / Food for thought
రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.రాతిలో ప్రాణం ఎక్కడ? ప్రాణం లేకుండా
ఎదురుచూడటం ఎలా సాధ్యం, చెప్పు, ఓ వాల్మీకీ! ఓయీ విశ్వామిత్రా!
హే విజ్ఞానీ! ఇదేమిటో విశదంగా చెప్పు! నిరుడు నేను చూశాను,
స్టెనో అనుపమా దాస్ నాకోసం ఎంతో ఎదురు చూసింది.
ఎంత ప్రయత్నించినా తన ఉసురు నేను గుర్తించలేకపోయాను
టైప్ మెషీన్ టప్ టప్ టప్ టప్ అన్నట్టు, ఆమె గొంతులోనుంచి
మాట వెనుక మాట, మాట వెనుక మాట ఇప్పటికీ నా చెవుల్లో రింగుమని మోగుతున్నాయి.
హే శ్రీరామా! హే నీలసాగరా! జీవనబాటలో దుఖం తప్ప మరేమయినా మిగిలి ఉన్నదా?
-- అవ్యయ, సౌభాగ్య కుమార్ మిశ్రా; అనువాదం వేలూరి
Comments
Post a Comment