ఇరవు
జనవరి 14, 2025
ఇరవు (iravu)
అర్థము
(విశేష్యము/విశేషణము) : స్థానము; స్థిరము; తగిన; కదలనిది; ఇల్లు
Meaning
(noun/adj) : place; firm; fixed; suitable; abode
వాడుక / Usage
బాలుడవై రేపల్లెలో బాలుదాగేవేళ యీలీలలనే పవళించి యిరవైతివా. Suckling milk as a baby in Repalle, did you sleep and grace the place?!
మెదడుకు మేత / Food for thought
నేననీ నీవనీ వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎప్పుడైనా
రెప్ప వెనకాల స్వప్నం
ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే....
మొదటి సారి మదిని చేరి
నిదుర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ మాయేనా
పదము నాది పరుగు నీది
రథము వెయ్యిరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషోత్తమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటనే రానా
-- కొత్త బంగారు లోకం, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)
Comments
Post a Comment