చంచు
జనవరి 16, 2025
చంచు (chanchu)
అర్థము
(విశేష్యము) : పక్షి ముక్కు; సుప్రసిద్ధమైన
Meaning
(noun) : beak; highly famous/popular/renowned
వాడుక / Usage
చంచులద్వారకలోన సత్య బామతొడమీఁద ముంచి యీరీతి నొరగి ముచ్చటలాడితివా. In renowned Dwaraka, resting your head on Satyabhama's laps, chitchats you enjoyed galore!
మెదడుకు మేత / Food for thought
అల్లంత దూరాన ఆ తారకాకళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
భూమి కనలేదు ఇన్నాళ్ళుగా
ఈమెలా ఉన్న ఏపోలికా
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
అల్లంత దూరాన ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
కన్యాదానంగా ఈ సంపద
చేపట్టే ఆ వరుడూ శ్రీహరి కాడా
పొందాలనుకున్నా పొందే వీలుందా
అందరికి అందనిది సుందరి నీడా
ఇందరి చేతులు పంచిన మమతా
పచ్చగ పెంచిన పూలతో
నిత్యం విరిసే నందనమవగా
అందానికే అందమనిపించగా
దిగివచ్చెనో ఏమో దివి కానుక
అరుదైన చిన్నారిగా
కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలువుండగా
తన వయ్యారంతో ఈ చిన్నది
లాగిందో ఎందరిని నిలబడనీకా
ఎన్నో ఒంపుల్తో పొంగే ఈ నది
తనే మదిని ముంచిందో ఎవరికి ఎరుకా
తొలిపరిచయమొక తియ్యని కలగా
నిలిపిన హృదయమే సాక్షిగా
ప్రతి జ్ఞాపకం దీవించగా
చెలి జీవితం వెలిగించగా
అల్లంత దూరాన ఆ తారకా
కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా
-- ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)
Comments
Post a Comment