పొదలు

 

జనవరి 17, 2025

పొదలు (podalu)

   అర్థము

  (క్రియ) : వృద్ధి చెందు; వర్ధిల్లు; పొంగు; ప్రకాశించు

  Meaning

  (verb) : to increase/prosper/expand/beam

   వాడుక / Usage

   పరియారువేలింతులపాలిండ్లు తలగడలై పొదల నిటువలనే భోగించితివా.
   Did you enjoy not, resting your head on the beaming bosoms of your sixteen thousand wives!

  మెదడుకు మేత / Food for thought

     స్వప్నాలను పిలిచే చేతులివి
    సత్యాలుగ మలిచే చేతలివి
    నిట్టూరుపు తెలియని ఆశలివి
    కన్నీళ్ళను తుడిచే చెలిమవుతాం
    కష్టాలను గెలిచే బలమౌతాం...
    కలకాలం నిలిచే కధలవుతాం
    మనరేపటి కోసం.....   
    మావాదం గీతకి అనువాదం
    మాక్రోధం శాంతికి అభివాదం
    మా స్వేదం స్వేచ్చకి అభిషేకం
    మానాదం నవతకి చైత్ర స్వరం
    మా పాదం భవితకి భానురధం
    మాపయనం ప్రగతికి ధర్మపధం
    తొలి అడుగెయ్ నేస్తం

    -- యువసేన, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి