వెలువరించు
జనవరి 08, 2025
వెలువరించు (veluvarinchu)
అర్థము
(క్రియ) : అచ్చు రూపంలో బయటకు ప్రకటించు; బయట పెట్టు; పోగొట్టు
Meaning
(verb) : to send out; to vent; to make public (via print)
వాడుక / Usage
ఈ అనుమానం ధర్మపాణి ఇంతకు ముందే వెలువరించాడు. Dharmapani has previously expressed this doubt.
మెదడుకు మేత / Food for thought
ఈ కథలో ప్రతినాయకుడు అవజ్ఞవర్మ. అతడు కుటిలుడు, దుష్టుడు, అత్యాశాపరుడు. తన బలహీనతలు, పరిమితులు తెలిసినవాడు. కార్యసాధనకై ఆత్మాభిమానాన్ని పణంగా పెట్టగలిగినవాడు. వ్యక్తిత్వం బలమైనది కాకపోయినా ఆశయబలంతో బలవంతులతో పోటీ పడినవాడు. అవకాశవాదంతో అర్హతకు మించిన అవకాశాలు పొందగలిగిన వాడు. ఈ రచనలో అతడి పాత్ర అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుందికానీ -కర్ణుడి తల భారతమన్నట్లు - అతడే ఇంత కథకూ కారణమయ్యాడు. -- దాసరి సుబ్రహ్మణ్యం గారి "అగ్నిమాల" కు ముందు మాట, వసుంధర
Comments
Post a Comment