నుడివిల్లు

 

జనవరి 22, 2025

నుడివిల్లు (nudivillu)

   అర్థము

  (విశేష్యము) : కనుబొమ్మ (నుదురు మీద విల్లులా ఉంటుంది)

  Meaning

  (noun) : eye brow

   వాడుక / Usage

    నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా?
    Can he (Rama) bend the eye b(r)ow ie assuage the lotus eyed Sita when she is angry?

  మెదడుకు మేత / Food for thought

     ఈ వాదనలు నేను పెద్ద పట్టించుకోను. నేను అనుకునేది చెప్తాను. నేను కేవలం మనిషిని. నాకూ ఆశలు ఉన్నాయి. దేశానికి మంచి విషయాలు, ధనం లభించాలి. అవసరమైతే దానికోసం మిగతా దేశాలనుంచి దొంగతనం చేస్తాను దోపిడీ చేస్తాను. దేశం కొరకు నేను కోపం తెచ్చుకోగలను. దేశానికి జరిగిన పరాభవాలుపై పగ తీర్చుకోడానికి కొట్టగలను, చంపగలను కూడా. మోహించడానికి నాకు దేశం శరీరం రూపంలో కావాలి. దేశాన్ని ఒక మానవ ఆకారంలో ఊహిస్తాను ఒక తల్లిగా, దేవతగా దుర్గాదేవిగా - బలిగా భూమిని ఎర్రబారుస్తాను. నేను మనిషిని. దైవాన్ని కాదు.

    -- ఘరే బాయిరే అనే నవలలో కథానాయకురాలు బిమల, రవీంద్రనాథ్ ఠాగోర్ (మే 7, 1861 - 1941)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి