సడి
జనవరి 23, 2025
సడి (saḍi)
అర్థము
(విశేష్యము) : అపకీర్తి; నింద; అలజడి; ధ్వని; సైగ
Meaning
(noun) : disgrace; blame; noise; sign
వాడుక / Usage
సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధా వాణి మిథిలా వేణి మదివెనుక పలుకు పలుకులెఱుగ గలడా? With just a nod he leads a thousand armies; can he know the words that ring in the mind of Sita - Earth incarnate, of Mithila adorning beautiful tresses?
మెదడుకు మేత / Food for thought
చూడు నిఖిల్, స్త్రీ గుండెలో నిజం ఎలా రక్తమాంసా కృతి ధరిస్తుందో. స్త్రీకి క్రూరంగా ఎలా ఉండాలో తెలుసు; వారి ఆవేశం ఒక మహోజ్వల తుఫాను. అది ఒక అందమైన భయానకం. మగవారిలో నిజం వికృతం. ఎందుకంటే ఆలోచన, వివేకం వారిని చీడ పురుగులాగా తొలుస్తూ ఉంటాయి. నేను చెప్తున్నాను నిఖిల్, మన దేశాన్ని ఆడవారే కాపాడుతారు. ఇది ధర్మాలు వల్లె వేసే సమయం కాదు. మనం తొట్రుపడకుండా వివేకానికి తావు ఇవ్వకుండా క్రౌర్యంగా ఉండాలి. పాపం చేయాలి. మన పాపానికి సంకేతంగా ఆడవారి నుదుట ఎర్ర సింధూరం పూలమాలి. -- ఘరే బాయిరే అనే నవలలో ప్రతినాయకుడు సందీప్ బాబు, రవీంద్రనాథ్ ఠాగోర్ (మే 7, 1861 - 1941)
Comments
Post a Comment