శరము

 

జనవరి 30, 2025

శరము (ṣaramu)

   అర్థము

  (విశేష్యము) : బాణము; రెల్లు గడ్డి; నీరు

  Meaning

  (noun) : arrow; reed; water

   వాడుక / Usage

    సుడిగాడ్పులా అడుగేయరా సర సర సర సర శరమే తనువే తాకగా చర చర చర చర చెలరేగాలి వేగంగా.
    Move ahead like a whirlwind, whizzing arrow piercing body, scorch through imperiously.

  మెదడుకు మేత / Food for thought

     ఆమె 'బోన్సాయ్ బతుకులు' కంటే మంచి ఫెమినిస్టు కథ ఉంటుందా? అతి సులువుగా జెండర్ పాఠాలనెన్నింటినో ఆమె తన కథలలో చెప్పారు. ఆమె తనకు తెలిసిన బాగా పరిచయమైన మధ్యతరగతి స్త్రీల గురించే రాశారు. తను ఎవరి కోసం రాస్తున్నానో, ఎవరు తన పాఠకులో ఆమెకు తెలుసు. ఐతే వివక్షను, అసమానతలు ఎత్తిచూపడానికి ఆమె ఎంచుకున్న జీవితాలు, ఇతివృత్తాలు ఎంతో బాగా సరిపోయాయి. స్త్రీలు చేసే చాకిరి, స్త్రీలకు పని చేసే చోట ఎదురయ్యే లైంగిక వేధింపులు, భర్తలకు నీడల్లా బతకాల్సిన పరిస్థితి, వీటన్నింటి మీదా తిరగబడాలనిపించే వారి మానసిక స్థితి- వీటిని ఛాయాదేవిగారు చాలా నేర్పుగా పట్టుకున్నారు.

-- అబ్బూరి ఛాయాదేవి (1933 - 2019) గురించి ఓల్గా

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి