అల్లకల్లోలము
జనవరి 06, 2025
అల్లకల్లోలము (alla-kallōlamu)
అర్థము
(విశేషణము) : గందరగోళం; తారుమారు; అలజడి
Meaning
(adv/noun) : tumult; confusion; disorder
వాడుక / Usage
కృష్ణకు అవతల జరుగుతున్న అల్లకల్లోలాలు అరాజకం గురించి నీకు అంతగా తెలిసి ఉండదు. You don't know much about the disorder and lawlessness on the other side of Krishna.
మెదడుకు మేత / Food for thought
సృష్టిలో జీవరాశులు అనంతం. సృష్టి అనంతంగా కొనసాగడానికి ఇంచుమించు అన్ని జీవరాశుల్లోనూ స్త్రీపురుష విభజన సామాన్యం. మనుషుల్లో స్త్రీ పురుష బంధాన్ని అసామాన్యం చేసింది ప్రేమ. సామాన్య జీవితంలో అంతర్లీనమై భాసిల్లే ప్రేమని వెలికి తీసి మనోహరం చేసి సామాన్యుడికి అందిస్తుంది సాహిత్యం. ఏ భాష సాహితి చూసినా నరజాతి చరిత్ర సమస్తం ప్రేమాయణ పరవశత్వం. సాహిత్యంలో ప్రేమ పుట్టుకకు - వినికిడి, తొలిచూపు కారణమవ్వడం సర్వసాధారణం. కొండొకచో వ్యామోహం, రాజకీయం ప్రేమకు దారితీసినా - ఆ కథల్లో వ్యూహానికున్న ప్రాధాన్యం ప్రేమకు లేకవపోవడం సాధారణం. అలా చూస్తే అసామాన్య రచయిత శ్రీ దాసరి సుబ్రహ్మణ్య కృత "అగ్నిమాల" అసాధారణం. -- దాసరి సుబ్రహ్మణ్యం గారి "అగ్నిమాల" కు ముందు మాట, వసుంధర
Comments
Post a Comment