కొంచ
జనవరి 15, 2025
కొంచ (koncha)
అర్థము
(విశేష్యము) : సందేహము; పిరికితనం
Meaning
(noun) : doubt; hesitation; cowardliness
వాడుక / Usage
కొంచక మధురలోనఁ గుబ్బఇంట నీలాగుల మంచాలపైఁ బవళించి మరిగితివా. Without any hesitation did(nt) you enjoy sleeping on the bedecked bed of the damsel in Mathura?!
మెదడుకు మేత / Food for thought
అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదనీమరి ఎవ్రీ డే ని సండే అని అనుకుంటే తప్పు కాదా అని
అది తెలిసి ఎందువలనో పెద్దవాళ్ళు ఒప్పుకోరు
పదమంటూ స్కూలుకేసి సిక్స్ డేస్ తరుముతారు
హే..అయ్యయ్యో ఎంత తప్పు ఎవ్వరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
అడగాలనుంది ఒక డౌటుని సన్ రైజ్ లేని రోజేదనీ
ఈ హైటే నాకు ఉంటే - అమ్మో ఎంత డేంజర్
నాక్కూడా మీసముంటే - ఏం చేస్తావు మేజర్
క్లాస్ మిస్ చైర్ లోన నేను కూర్చుంటా
కామిక్స్ క్లాస్ బుక్స్ చేసి చదివిస్తా
స్కూలుకి ప్రిన్సిపాల్ సార్ నే అవుతా
ఆల్ డేస్ హాలీడేస్ ఆడుకోండి అంటా
ఎగ్జామ్స్ వస్తే అపుడు ఎలా మరి
మార్కులు కూడా మీరే వేస్తే సరి
హే.. అయ్యాయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
చాలమ్మా ఆటలింక - కొంచెం ఆగుమమ్మీ
రానంటే వెళ్ళిపోతా- నో నో వద్దు డాడీ
ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా
ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తు రాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి
ఎంచక్కా నిదరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో
నాక్కూడా మీసముంటే - ఏం చేస్తావు మేజర్
క్లాస్ మిస్ చైర్ లోన నేను కూర్చుంటా
కామిక్స్ క్లాస్ బుక్స్ చేసి చదివిస్తా
స్కూలుకి ప్రిన్సిపాల్ సార్ నే అవుతా
ఆల్ డేస్ హాలీడేస్ ఆడుకోండి అంటా
ఎగ్జామ్స్ వస్తే అపుడు ఎలా మరి
మార్కులు కూడా మీరే వేస్తే సరి
హే.. అయ్యాయ్యో ఎంత తప్పు ఎవరూ అడగరే
హ్యాపీగా ఆడుకుంటాం అంటే వదలరే
చాలమ్మా ఆటలింక - కొంచెం ఆగుమమ్మీ
రానంటే వెళ్ళిపోతా- నో నో వద్దు డాడీ
ఆటకైనా పాటకైనా ఆఖరంటూ లేదా
ఆకలేస్తే అప్పుడైనా అమ్మ గుర్తు రాదా
పిట్టలైనా పొద్దుపోతే గూడు చేరుకోవా
పిల్లలైనా పెద్దలైనా రాత్రి నిద్దరోరా
నైటే రాని చోటే చూస్తే సరి
అక్కడ ఆటకు బ్రేకులు ఉండవు మరి
ఎంచక్కా నిదరోయి కలలో జారుకో
ఆ కలతో నువ్వు కోరే చోటే చేరుకో
-- లిటిల్ సోల్జర్స్, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)
Comments
Post a Comment