కళవళము

 

జనవరి 09, 2025

కళవళము (kaḷa-vaḷamu)

   అర్థము

  (విశేష్యము) : కలత; తొట్రుపాటు; క్షోభ

  Meaning

  (noun) : anxiety; distress; confusion

   వాడుక / Usage

   అగ్నిపాలుడు కొంచం కళవెళ పడ్డాడు.
   Agnipala felt a tinge of anxiety.

  మెదడుకు మేత / Food for thought

    ఈ కథలో పాత్రల పేర్లు గమనించతగ్గవి. ప్రతిద్వందులైన రాజులిద్దరూ భోజులే. 'నవ'భోజుడు ఆధునిక దృక్పథానికీ, 'కాల'భోజుడు కౌటిల్యానికీ సూచనలు. అవజ్ఞుడు తిరస్కరించబడినవాడు. బేతాళుడు కథను పొడిగించినవాడు. రాజద్రోహానికి తలపడినా స్నేహానికి ప్రాణమిచ్చేవాడు విష్ణు'మిత్రుడు'. అనుమానితుడిని బందీ చేసినా నిర్దోషిత్వ నిరూపణకు అవకాశమిచ్చినవాడు 'ధర్మ'నందుడు. విశ్వాసపాత్రుడైన సేనాని హనుమప్ప. విధి నిర్వహణకు సూచికగా కథానాయకుడు అగ్నిపాలుడు. ప్రేమాస్వాదనకు తగిన కథానాయిక వకుళమాల. రాజకీయపరంగా అత్యావశ్యకమైన వారి కలయిక 'అగ్నిమాల'గా ఈ రచనకు మకుటం.

   -- దాసరి సుబ్రహ్మణ్యం గారి "అగ్నిమాల" కు ముందు మాట, వసుంధర

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి