నయానా భయాన

 

ఫిబ్రవరి 13, 2025

నయానా భయాన (nayaana bhayana)

   అర్థము

  (విశేషణము) : సముదాయించో లేక బెదిరించో; నయము=మృదువు

  Meaning

  (adv) : by persuasion/enticement or threat

   వాడుక / Usage

    షోయబుల్లాఖాన్ వ్యాసాలప్రాభావం నిజాం పరిపాలనకు కంటకప్రాయమై నయానా భయాన నచ్చచెప్పి తన కలాన్ని నియంత్రించడానికి అనేకవిధాల ప్రయత్నించారు.
    Shoaibullah Khan's writings were a thorn in the side of Nizam and he was enticed and threatened to stop publishing them.

  మెదడుకు మేత / Food for thought

     సా.శ. 739లో చైనీస్ యాత్రికుడు యుఁఆన్‌ చ్వాంగ్‌ బెజవాడను సందర్శించాడు. ఈ నగరం తెనకచక రాజ్యంలో భాగంగా ఉండేదని రాసుకున్నాడు. ఈ తెనకచక అంటే ధాన్యకటకానికి రూపాంతరం. యుఁఆన్ చ్వాంగ్ ఇక్కడ బెజవాడ, సీతానగరం, ఉండవల్లి కొండల మీద గుహల్లో ఎందరో బౌద్ధ భిక్షువులు ఉండేవారని, సాయంత్రం అయితే అక్కడ వెలిగించిన దీపాల వెలుగులో బెజవాడ ప్రాంతమంతా కన్నుల పండువగా ఉండేదని రాసుకున్నాడు. ఇంద్రకీలాద్రి కొండమీద బౌద్ధ భిక్షువులు నివసించేందుకు కొండను తొలిపించి పలు చావడులు, వసారాలు నిర్మించి ఉన్నాయని రాశాడు. నదీతీరాన సకల వ్యాధులను హరింపజేసే వనౌషధాల పర్వతం ఉండేదనీ, దానిని వైద్యులు వినియోగించుకునేవారనీ, ఇక్కడ పర్వత సానువుల్లో సంచరించే సాధువులకు బంగారం తయారుచేసే హేమవిద్య ఉండేదనీ రాశాడు.
    -- విజయవాడ, వికీపీడియా

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి