ఆనవాలు

 

ఫిబ్రవరి 17, 2025

ఆనవాలు (ānavālu)

   అర్థము

  (విశేష్యము) : అడియాలము; గురుతు; చిహ్నము; రుజువు; రాజముద్ర

  Meaning

  (noun) : sign; token of identification

   వాడుక / Usage

    చరిత్రకు ఆనవాలుగా నిలిచిన అశోకుని శిలాశాసనాలు కర్నూలు జిల్లా తుగ్గిలి మండలంలో ఉన్నాయి.
     Ashoka's rock edicts, a mark of history, are seen in Kurnool district Tuggili mandal.

  మెదడుకు మేత / Food for thought

    చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
    ఎవరి కనుల చిలిపి కలవమ్మా 
    మువ్వలే మనసు పడు పాదమా
    ఊహలే ఉలికి పడు ప్రాయమా
    హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
    ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
    వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
    అడుగుతునవే కుందనాల బొమ్మ
    సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
    ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
    అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
    ఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమా

    -- నీ స్నేహం, సిరివెన్నెల సీతారామశాస్త్రి (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి