ఆనవాయితి

 

ఫిబ్రవరి 18, 2025

ఆనవాయితి (ānavāyithi)

   అర్థము

  (విశేష్యము) : మొదటినుంచి వచ్చినది; ఆచారం; సంప్రదాయం; రివాజు

  Meaning

  (noun) : custom; practice; tradition

   వాడుక / Usage

    సంక్రాంతి పండుగకు ప్రతి ఆడపిల్ల పుట్టింటికి వెళ్లే ఆనవాయితి ఉంది గనుక పోలమాంబ అమ్మవారిని సంక్రాంతి రోజుకు ముందు వచ్చే మంగళవారం గ్రామంలోనికి తెస్తారు.
     As it is custom for daughters to go to parents home during Sankranthi, Polamamba is brought into the village the previous Tuesday.

  మెదడుకు మేత / Food for thought

    చేసేది ఏమిటొ చేసేయ్యి సూటిగా
    వేసెయ్యిపాగా ఈ కోటలో "చేసేది"
    ఎన్ని కష్టాలు రానీ నష్టాలు గానీ
    నీ మాట దక్కించుకో బాబయా...బాబయ్యా "చేసేది"

    నాటేది ఒక్క మొక్క వేసేది నూరుకొమ్ము
    కొమ్మ కొమ్మ విరగబూసె వేలాదిగా ....ఆ... "నాటేది"
    ఇక కాయలి బంగారు కాయలు
    భోంచేయాలి మీ పిల్లకాయలు ఇక కాయలి "చేసేది"

    రహదారి వెంట మొక్కనాటి పెంచరా
    కలవాడు లేనివాడు నిన్ను తలచురా
    భువిని తరతరాల నీదు పేరు నిలచురా
    పనిచేయువాడె ఫలము నారగించురా...భుమిని "చేసేది"

    -- తెనాలి రామకృష్ణ, సముద్రాల సీనియర్ (జులై 19, 1902 - 1968)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి