అడంగులు
ఫిబ్రవరి 20, 2025
అడంగులు (aḍangulu)
అర్థము
(విశేష్యము) : గ్రామానికి సంబంధించి లెక్కల పుస్తకం; పడవలో వేసే అడ్డు చెక్క; తెలియని స్థితి
Meaning
(noun) : village records book; wooden plank in a boat; uncertain situation
వాడుక / Usage
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో అడంగులలో అవకతవకలు బయటపడుతున్నాయి.
Shady dealings in village records come to light with Land titling act.
మెదడుకు మేత / Food for thought
బాబూ..బాబు బాబు బాబు ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
బాబు కోటి విద్యలు కూటి కోసమే పూటే గడవని ముష్టి జీవితం
పాటు పడగయే పని రాదాయే సాటి మనిషిని సావనా బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ఐస్ క్రీం తింటే ఆకలి పోదు కాసులతోనే కడుపు నిండదు
అయ్యా..అమ్మా..బాబూ..
చేసే దానం చిన్నది అయినా పాపాలన్నీ బావును బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
నీ చెయి పైన నా చెయి కింద
ఇచ్చి పుచ్చుకొను రుణమే బాబూ
ముష్టి ఏమిటిది ముసలి బ్రహ్మ
మన చిట్టాలు రాసే జమలే బాబూ
ధర్మం అరణా ఒరణా రెండణా
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
ధర్మం చేస్తే పుణ్యమొస్తది ఖర్మ నసిస్తది బాబూ
ధర్మం చెయ్ బాబు కాణీ ధర్మం చెయ్ బాబు
-- మిస్సమ్మ, పింగళి నాగేంద్ర రావు (డిసెంబర్ 29, 1901 - 1971)
Comments
Post a Comment