అల్లిబిల్లి
ఫిబ్రవరి 21, 2025
అల్లిబిల్లి (alli-billi)
అర్థము
(విశేష్యము) : కలిసిమెలిసి ఉన్నది; పెనవేసుకొని; స్నేహం; ప్రియమైనది; దట్టమైనది
Meaning
(noun) : intertwined; endearing; lovey dovey
వాడుక / Usage
అల్లిబిల్లి కలలా రావే అల్లుకున్న కధలా రావే మల్లెపూల చినుకై రావే పల్లవించు పలుకై రావే వేచే ఎదలో వెలుగై రావే.
Come as an endearing dream, come as an intertwining story, come as drops with jasmine fragrance, come as the word of a melody, Come light my heart!
మెదడుకు మేత / Food for thought
ఓ చందమామ అందాల భామ ఎందున్నదో పలుకుమా
సొగసూ వయసూ తన లావణ్యమే చాలనీ
పై సోయగాలు ఏలనీ లాలించుమా
సోయగాలు ఏలనీ లాలించుమా "ఓ చందమామ"
మదిలో మెదిలే మధురానందమే తాననీ
ఇక ఆలసించరాదనీ బోధింపుమా
ఆలసించరాదనీ బోధింపుమా "ఓ చందమామ"
-- జయం మనదే, కొసరాజు రాఘవయ్య (జూన్ 23, 1905 - 1987)
Comments
Post a Comment