గిబ్బరౌతు
ఫిబ్రవరి 26, 2025
గిబ్బరౌతు (gibba-routhu)
అర్థము
(విశేష్యము) : గిబ్బ=ఎద్దు, వృషభం; వృషభవాహనుడు; శివుడు
Meaning
(noun) : an epithet of Shiva; one who rides a bull
వాడుక / Usage
చాళుక్యుల వాస్తుశిల్పానికి ప్రతిరూపమైన ఐహోల్ దుర్గా ఆలయంలో అందమైన గిబ్బరౌతు శిల్పం ఉంది.
The Durga temple of Aihole, epitome of Chalukyan architecture, has a beautiful panel of Shiva.
మెదడుకు మేత / Food for thought
వృద్ధాప్యంలో పిల్లల వద్ద మనంగాని, మన చెంత వారు గాని ఉండే రోజులు పోయినవి. అట్టి నిస్సహాయస్థితిలో ఓపిక ఉన్నంతలో నా సంతానానికి వారి సంతానాలకు నా వృత్తాంతం పుస్తక రూపంలో తెలియ చేయాలన్న కోరిక కలిగింది. గతంలో మనుష్యులు వారి ఆలోచనలు పోకడలు మమకారాలు ఎలా ఉండేవో తెలియచేయడం తెలుసుకోవడం చారిత్రక అవసరం అని భావించాను.-- నేను నా తరం, లంకా సత్యనారాయణ, విలేఖరి, అధ్యాపకులు, బహు భాషా కోవిదులు
Comments
Post a Comment