అలుపు సొలుపు

 

ఫిబ్రవరి 12, 2025

అలుపు సొలుపు (alupu solupu)

   అర్థము

  (విశేష్యము) : శ్రమ; ఆయాసము; అలుపు=బడలిక, సొలుపు=కాళ్ళ వాతం

  Meaning

  (noun) : fatigue; exhaustion

   వాడుక / Usage

    ఈ బుల్లిపిట్ట 13,560కిలోమీటర్లు అలుపు సొలుపు లేకుండా ఎగిరింది.
    The bar tailed godwit flew 13,560 km at a stretch ignoring fatigue.

  మెదడుకు మేత / Food for thought

     గంగలకుర్రు, గంగలకుర్రు (అగ్రహారం) రుద్రప్రభలు ఈ జగ్గన్నతోటకి రావాలంటే మధ్యలో కౌశికి దాటాలి. ఆ ప్రభలు         ఆకాలువలోంచి ఏమాత్రం తొట్రూలేకుండా ‘హరాహరా’అంటూ తీసుకువచ్చే ఆగ్రామస్తుల ధైర్యం చూడడానికి             రెండు కళ్లు చాలవు. అసలే కాలువలో నడవడం అనేది అసాధారణం. అలాంటిది ఏకంగా 30 మంది మోస్తేనే గానీ         లేవనిప్రభలను ఆ కాలువలో నుంచి తోటలోకి తీసుకువచ్చే సన్నివేశం చూసేవారికి ఒల్లుగగుర్పొడుస్తుంది.                 కాలువలోకి ప్రభను తరలించే ముందు ఒక వరిచేనుని ఆ ప్రభలు దాటవలిసి వస్తుంది. ఆ చేనుని తొక్కుతూ..             పంటను తొక్కుతూ వచ్చినా రైతులు ఏ మాత్రం బాధపడరు సరికదా సాక్షాత్తూ ఆపరమేశ్వరుడు తమ చేలగుండా     వెళ్ళడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశాలలలో స్థిరపడిన     తెలుగువారు..వారితోపాటు ఇతరులు సైతం అక్కడికి తరలివస్తారు.

    -- గంగలకుర్రు, timesnowtelugu

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి