అవకతవక
ఫిబ్రవరి 28, 2025
అవకతవక (avaka-thavaka)
అర్థము
(విశేష్యము) : అవ్వాల్సినవి తగినవి అవ్వకపోడం; (చట్ట వ్యతిరేకంగా) పొరపాటు; అసంబద్ధము
Meaning
(noun) : irregularities; out of turn; errors of omission and commission
వాడుక / Usage
ఎన్నికల విధుల్లో అవకతవకలు.. సూర్యాపేట జిల్లాలో ముగ్గురు అధికారులపై వేటు.
Irregularities in election duties... 3 officials sacked in Suryapet district.
మెదడుకు మేత / Food for thought
నీకేమన్నా చాదస్తమా? ఈ రోజుల్లో సంస్కృతం కూడు పెడుతుందా? నేను వీడిని తెనాలి తీసుకుపోయి వారాలు ఏర్పాటు చేస్తాను. హిందీ నేర్పిస్తాను. మంచి ఉద్యోగాలు వస్తాయి. ఆయన ఒక వారం, ఆయన తమ్ముడు ఒకటి, సత్యనారాయణ అనే టీచర్ ఇంట్లో ఒక వారం, పిల్లలమర్రి రామమూర్తి గారింట్లో ఒక వారం. వారికి ఏమైనా ఇబ్బందులొస్తే పెట్టే వారు కాదు. ఇక ఆ రోజు ఉపవాసామే. ఈ రోజు మీ ఇంట్లో వారమండి అని ఉదయమే గుర్తు చెయ్యాలి. కాలినడకన రోజుకు మూడు మార్లు కిలోమీటర్లు కొద్దీ వారింటికి నడిచి వెళ్ళాలి. అలా వేరే వేరే ఇళ్లలో తింటూ ఊర్లలో చదువుతూ హిందీ పరీక్షలన్నీ మంచి మార్కులతో విజయం సాధించాను. 1954లో 20 ఏళ్ళ వయసులో హిందీ పండిట్ గా ఉద్యోగం వచ్చింది.-- నేను నా తరం, లంకా సత్యనారాయణ, విలేఖరి, అధ్యాపకులు, బహు భాషా కోవిదులు
Comments
Post a Comment